నెరవేరిన చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ

Byline :  Kiran
Update: 2023-10-04 17:22 GMT

మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నేరనుంది. చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సీఎం కేసీఆర్‌ చెన్నూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల మంచిర్యాల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ చెన్నూరును రెవెన్యూ డివిజన్‌ చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూరు, జైపూర్‌, భీమారం, కొత్తపల్లి, మందమర్రి, అస్నాద్‌, పారుపల్లి మండలాలతో చెన్నూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించింది.

మరోవైపు జిల్లాలోని అస్నాద్, పారుపల్లిని కొత్త మండలాలుగా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చెన్నూరు మండలంలోని 11 గ్రామాలతో అస్నాద్‌ను కొత్త మండల కేంద్రంగా, కొత్తపల్లి మండలంలోని పారుపల్లి కేంద్రంగా 19 గ్రామాలతో మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.




Tags:    

Similar News