Adluri Laxman:ప్రభుత్వ విప్ కారు బోల్తా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు;

By :  Kiran
Update: 2024-02-19 01:23 GMT



తెలంగాణ ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్‌ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


Telangana Government Whip, Dharmapuri MLA Adluri Laxman Kumar, car overturned , Ambaripet in Endapalli mandal , Jagtial district, minor injuries , shifted to Karimnagar

Tags:    

Similar News