తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెప్టినెంట్ పదవులకు కూడా రిజైన్ చేశారు. తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో బరిలో ఉంటున్నట్లు సమాచారం. చెన్త్నెసౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి ఎంపీగా పోటీ చేయునట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, కన్యాకుమారిలో ఆమె సామాజిక వర్గ అయిన వాడర్ ఓట్లు అధికంగా ఉన్నాయి. తెలంగాణ గవర్నర్‌గా 2019. సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు.
గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ పలు నిర్ణయాలు అడ్డుకుని సంచలనంగా మారారు.తమిళసై 2006లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఇప్పటివరకు ఒక్క విజయం దక్కలేదు. తమిళసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు పీసీసీ చీఫ్ గా పని చేసారు. తమిళసై 1999 లో బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. అధ్యక్షురాలిగా.. జాతీయ కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరచెన్నై నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయారు. 2011, 2019 ఎన్నికల్లోనూ తమిళిసైకు ఓటమి తప్పలేదు.