న్యూ ఇయర్ హాలిడేపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

By :  Bharath
Update: 2023-12-25 10:03 GMT

న్యూ ఇయర్ హాలిడేపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1ని జనరల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024, జనవరి 1న కొత్త సంవత్సరం హాలిడే ప్రకటించడంతో.. 2024 ఫిబ్రవరి రెండో శనివారం రోజున సెలవును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

న్యూ ఇయర్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేడుకలు శాంతియుతంగా జరుపుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజున పార్టీలకు వెళ్లేవాళ్లు.. పబ్ లు, క్లబ్ లు, ఇతర పార్టీల నిర్వాహకులకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని క్లబ్ లు, బార్ లు, రెస్టారెంట్లు, పబ్ లు, హోటళ్లు తెల్లవారు జామున ఒంటి గంట వరకు పార్టీలు జరపాలంటే.. ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. దాంతో పాటు వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.



Tags:    

Similar News