సీఎం రేవంత్కు ఇద్దరు కొత్త PROలు.. ఉత్తర్వులు జారీ

By :  Bharath
Update: 2024-01-11 13:55 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను (PRO) ప్రభుత్వం నియమించింది. బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్ ను పీఆర్వోలుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పత్రికల్లో పనిచేసిన అనుభవం ఉన్న వీరిద్దరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు వారి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం సీఎం పీఆర్వోలుగా నియమించింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై జరిగిన ఏఐసీసీ సమావేశం ముగిసింది. లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల చర్చలు జరిపారు.


Tags:    

Similar News