తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, 21న థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న థర్డ్ లాంగ్వేజ్, 23న మ్యాథ్స్, 26న సైన్స్ మొదటి పేపర్, 28న సైన్స్ రెండో పేపర్, 30న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 1వ తేదీన ఒకేషనల్ కోర్సుల వారికి సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్, 2న రెండో పేపర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మ్యాథ్స్ ఎగ్జామ్ తర్వాత 3 రోజులు సెలవు ఉంటుంది.