కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వ లేఖ

Byline :  Bharath
Update: 2023-12-20 12:25 GMT

కృష్ణా నదీ జలాల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. కృష్ణా నదీ జలాల నుంచి తమకు రావాల్సిన వాటా రావట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అవసరాలను మించి వాడుకుని తమకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇటీవల నాగార్జునా సాగర్ పై ఇరు రాష్ట్రాల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరో అంశంపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వ లేఖ రాసింది.

ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులు ఉల్లంఘించి మరీ పనులు చేస్తున్నారన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఆరోపించారు. ఈ క్రమంలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు లేఖ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ లేఖ ద్వారా కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News