సెప్టెంబర్ 17కు సంబంధించి కీలక ప్రకటన చేసిన తెలంగాణ సర్కారు

By :  Kiran
Update: 2023-09-11 17:09 GMT

సెప్టెంబర్ 17కు సంబంధించి తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌ స్టేట్‌ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్‌ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణ‌యించింది. ఆ రోజున నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్‌లో నిర్వ‌హించే వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగుర‌వేస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్ర‌భుత్వ చీఫ్‌ విప్‌లు, విప్‌లు జాతీయ జెండాల‌ను ఎగుర‌వేస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి అన్ని ఏర్పాట్ల‌ు చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాలో జెండా ఎగురవేసేది ఎవరంటే..

ఆదిలాబాద్ – గంప గోవ‌ర్ధ‌న్, ప్రభుత్వ విప్

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం – రేగా కాంతారావు,ప్ర‌భుత్వ విప్

జ‌గిత్యాల – కొప్పుల ఈశ్వ‌ర్, మంత్రి

భూపాల‌ప‌ల్లి – ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి,ఎమ్మెల్సీ

జ‌న‌గామ – ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మంత్రి

జోగులాంబ గ‌ద్వాల – ప‌ద్మారావు, డిప్యూటీ స్పీక‌ర్

కామారెడ్డి – పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్పీక‌ర్

ఖ‌మ్మం – పువ్వాడ అజ‌య్, మంత్రి

క‌రీంన‌గ‌ర్ – గంగుల క‌మ‌లాక‌ర్, మంత్రి

ఆసిఫాబాద్ – సుంక‌రి రాజు, ఎమ్మెల్యే

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – శ్రీనివాస్ గౌడ్, మంత్రి

మ‌హ‌బూబాబాద్ – స‌త్య‌వ‌తి రాథోడ్, మంత్రి

మంచిర్యాల – బాల్క సుమ‌న్, ప్ర‌భుత్వ విప్

మెద‌క్ – త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మంత్రి

మేడ్చ‌ల్ – మ‌ల్లారెడ్డి, మంత్రి

ములుగు – ప్ర‌భాక‌ర్ రావు, ప్ర‌భుత్వ విప్

నాగ‌ర్‌క‌ర్నూల్ – గువ్వ‌ల బాల‌రాజు, ప్ర‌భుత్వ విప్

న‌ల్ల‌గొండ – గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్

నారాయ‌ణ‌పేట – సునీతా ల‌క్ష్మారెడ్డి, మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్

నిర్మ‌ల్ – ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, మంత్రి

నిజామాబాద్ – వేముల ప్ర‌శాంత్ రెడ్డి, మంత్రి

పెద్ద‌ప‌ల్లి – భాను ప్ర‌సాద్ రావు, ప్ర‌భుత్వ చీఫ్‌ విప్

రాజ‌న్న సిరిసిల్ల – కేటీఆర్, మంత్రి

రంగారెడ్డి – స‌బితా ఇంద్రారెడ్డి, మంత్రి

సంగారెడ్డి – మ‌హ‌ముద్ అలీ, మంత్రి

సిద్దిపేట – హ‌రీశ్‌రావు, మంత్రి

సూర్యాపేట్ – జ‌గ‌దీశ్ రెడ్డి, మంత్రి

వికారాబాద్ – మ‌హేంద‌ర్ రెడ్డి, మంత్రి

వ‌న‌ప‌ర్తి – నిరంజ‌న్ రెడ్డి, మంత్రి

హ‌నుమ‌కొండ – దాస్యం విన‌య్ భాస్క‌ర్, ప్ర‌భుత్వ చీఫ్‌ విప్

వ‌రంగ‌ల్ – బండా ప్ర‌కాశ్, డిప్యూటీ చైర్మ‌న్

యాదాద్రి భువ‌న‌గిరి – సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్



telangana,ts government,september 17,hyderabad state,indian union,telangana national unity day,cm kcr,national flag,nampally,public garden,ministers,govt whips,flag hoisting,telangana districts

Tags:    

Similar News