కోకాపేట మజాకా..ఎకరం రూ.35 కోట్లు !.. హెచ్​ఎండీఏ నోటిఫికేషన్ జారీ

Update: 2023-07-07 13:55 GMT

హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలోని భూముల అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందిన సర్కార్.. మరోమారు వేలానికి సిద్ధమైంది. ఈ సారి 45 ఎకరాలను విక్రయించేందుకు హెచ్​ఎండీఏ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. 45 ఎకరాల్లో 7 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి వేలం వేయనుంది. ఈ ప్లాట్లు మూడెకరాలు నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఉన్నాయి.

ఎకరానికి కనీస ధర రూ.35 కోట్ల వరకు నిర్ణయించింది. ఈ వేలంలో భూములు కనీస ధరకు పోయినా దాదాపు రూ.1,600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఎక్కువ ఉండటంతో 2,500 కోట్లు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 20వ తేదీన ప్రీబిడ్ సమావేశం జరగనుంది. వేలం రిజిస్ట్రేషన్​కు నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఆగస్టు 3న ‘ఈ- వేలం’ ద్వారా భూములను విక్రయం కొనసాగనుంది. గత వేలంలో కోకాపేట భూములకు కోట్లు పలికిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News