Telangana Assembly : నీటిపారుదల శాఖపై శ్వేత పత్రం.. వ్యూహాలు రచిస్తోన్న కాంగ్రెస్-బీఆర్ఎస్

Byline :  Krishna
Update: 2024-02-11 05:35 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సభలో నీటిపారుదల శాఖపై కాంగ్రెస్ సర్కార్ శ్వేత పత్రం విడుదల చేయనుంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేలతో రేవంత్, భట్టి భేటీ కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

అసెంబ్లీలో కాంగ్రెస్కు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కేఆర్ఎంబీ అంశంతో ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు వ్యూహ రచన చేస్తోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రేవంత్ సర్కార్ చేతగాని తనంతోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని ఆరోపిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ సోమవారం అసెంబ్లీకి వస్తారా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News