సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 06:40 GMT

తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యథావిధిగా ఈనెల 27 ఎన్నికలు జరుగనున్నాయి. సింగరేణి ఎన్నికలపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో సింగరేణి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మధ్యంతర పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరుగనున్నాయి.

ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేసింది సింగరేణి యాజమాన్యం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని యూనియన్ తరపున సినియర్ కౌన్సిల్ కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు కదా అన్న విషయాన్ని మూడ్రోజుల(డిసెంబర్ 18) క్రితం జరిగిన విచారణలో హైకోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని యూనియన్ కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈరోజుకి(గురువారం) వాయిదా వేసింది. తాజా విచారణలో ఎన్నికలు డిసెంబర్ 27 జరగాలని తీర్పు ఇచ్చింది

Tags:    

Similar News