Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్ట్ బ్రేక్
By : Kiran
Update: 2023-10-09 17:34 GMT
తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్టుకు ఆదేశించింది. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ జాబితాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అక్టోబర్ 4న విడుదల చేసింది. మొత్తం 16,604 పోస్టులకు గాను.. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. అభ్యర్థుల నియామక ప్రక్రియ ప్రారంభంకానున్న తరుణంలో హైకోర్టు దానికి బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.