Mahmood Ali: గన్‌మెన్‌ను కొట్టడంపై హోంమంత్రి మహమూద్ అలీ ఏమన్నారంటే..?

By :  Krishna
Update: 2023-10-08 04:40 GMT

హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్‌పై చేయిచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి తీరు కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో గన్‌మెన్‌పై చేయిచేసుకోవడంపై మహమూద్‌ అలీ స్పందించారు. ప్రేమతో మాత్రమే కొట్టానని.. కొట్టాలనే ఉద్ధేశం తనకు లేదన్నారు. రేయి పగలు తన్ను కంటికి రెప్పలా భద్రత కల్పిస్తున్న గన్‌మెన్ తన కుమారుడు లాంటి వాడని.. ఆ ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. ఎంత చిన్నవారికైనా గౌరవం ఇస్తానని చెప్పిన మహమూద్ అలీ.. తనతో ఉన్నవారిని తన బిడ్డల్లా చూసుకుంటానని స్పష్టం చేశారు.

కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్ ​పుట్టినరోజు సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ ఆయనకు విషెస్ చెప్పారు. అయితే పూల బొకే విషయంలో మహమూద్​అలీ.. తన గన్​మెన్​ చెంపై కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. గన్ మెన్ ను కొట్టిన హోంమంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. నెటిజన్లు సైతం హోంమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News