TS Inter Exam Time Table 2024: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. శని, ఆదివారాల్లోనూ పరీక్షలు
By : Bharath
Update: 2023-12-28 13:39 GMT
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ (జనరల్/ వొకేషనల్) ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. రెండు సెషన్స్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయి. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.