Telangana Drinking Water: తాగునీటి స‌ర‌ఫ‌రాలో దేశంలోనే తెలంగాణది ఫస్ట్ ప్లేస్..

By :  Krishna
Update: 2023-10-12 13:02 GMT

ఇంటింటికి తాగునీరు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. దేశంలో ప్ర‌తి ఇంటికి మంచినీటి స‌ర‌ఫ‌రా అందించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ది ఇండియ‌న్ ఇండెక్స్ అనే సంస్థ ప్రకటించింది. ఇందులో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో గోవా ఉన్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో ప్ర‌తి ఇంటికి తాగునీటి క‌నెక్ష‌న్‌ను అందించేందుకు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ సీఎం కేసీఆర్ విజ‌న్ వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణ‌లో ఈ ప‌థ‌కం సక్సెస్ అవడంతో కేంద్రం హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ అనే ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఇవాళ తెలంగాణ చేసే అభివృద్ధిని.. రేపు మిగితా రాష్ట్రాలు అనుసరిస్తాయి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News