తెలంగాణ ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. శైలజా రామయ్యర్‌ను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక ఐఏఎస్ ఆమ్రపాలిని HMDA జాయింట్ కమిషనర్ గా, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది.
రిజ్వీకి ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగించింది. ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ లను నియమించింది. దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కం సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి నియామితులయ్యారు.