తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. హెలికాప్టర్లో ఇంధనం లేకపోవడంతో యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద దింపేశాడు. అక్కడ వ్యాన్‌లో ఇంధనం తీసుకువచ్చి నింపారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు మంత్రి, ఎంపీ అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం తిరిగి పయనమయ్యారు. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక, ఎర్రబెల్లి, కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.