తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ములుగు జిల్లాలో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి, వివిధ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి ముందుగా భూత్పూర్, మూసాపేట, వేముల, మహబూబ్‌నగర్‌లలో పర్యటిస్తారు కేటీఆర్. ఆ తర్వాత జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను స్టార్ట్ చేస్తారు. మంత్రి పర్యటన నేపథ్యం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూసాపేట మండలంలోని వేముల, మహబూబ్‌నగర్, జడ్చర్లలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడనున్నారు. కేటీఆర్‌తో పాటు ఈ పర్యటనలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే :
ఉదయం 9 గంటలకు హైదరాబాద్ సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి కేటీఆర్ స్టార్ట్ అవుతారు.
9:15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో హెలికాప్టర్ ఎక్కుతారు.
10 గంటలకు భూత్పూర్ కాలేజీ గ్రౌండ్‌కు చురుకుంటారు.
10:15 గంటలకు మున్సిపల్ పార్క్ ప్రారంభం.
10:30 గంటలకు వేములలోని ఓ ప్రైవేటు కంపెనీ యూనిట్‌కు శంకుస్థాపన.
11 గంటలకు జిల్లాలో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, సభలో ప్రసంగం.
మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం.
4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.