Minister Mallareddy : నాకు 800 ఎకరాల భూమి ఉంది, నాకేం ఖర్మ.. మల్లారెడ్డి

Update: 2023-11-16 16:54 GMT

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మామూలుగానే కామెడీ చేస్తుంటారు. పాలమ్మినా, పూలమ్మినా అంటూ హల్‌చల్ చేస్తుంటారు. ఆయనపై భూకబ్జా, కాలేజీ సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ అబద్ధమని కొట్టిపడేస్తుంటారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కోటీశ్వరుణ్నని చెబుతుంటారు. మాట జారి కొన్నిసార్లు చిక్కుల్లోనూ పడుతుంటారు. మల్లారెడ్డి తనకు ఫలానా మొత్తంలో ఆస్తులు ఉన్నాయని చెబుతున్నా ఆయన ఆస్తుల విలువెంతో లెక్కకట్టడం కష్టమని చెబుతుంటారు. తాజాగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తనకున్న భూమి వివరాలను బయటపెట్టారు.

తనకు 800 ఎకరాల ఆస్తి ఉందని, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ‘‘నేను రాజకీయాల్లోకి రాకుముందే నాకు కోట్లాది ఆస్తులు భూములు ఉన్నాయి. నాకు 800 ఎకరాల భూమి ఉంది. సూరారంలో 56 ఎకరాలు ఉంది. మైసమ్మగూడలో మునిగిన భూములు నావి కావు. కబ్జా చేయాల్సిన అవసరం నాకు లేదు’’ అని అన్నారు. రైతుబంధు పథకం కింద తనకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు జమ అవుతుందో తనకు తెలియదని, ఐదారు ఎకరాలకు మించిన ఈ పథకం కింద సొమ్ము తీసుకోనని చెప్పారు. తను పథకం ప్రకారం క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తానని, అందుకే విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. టీడీపీలో ఒంటరివాడినినయ్యాయని, అందుకే బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించానని చెప్పారు.


Tags:    

Similar News