రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు.. పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

Update: 2023-07-11 05:04 GMT

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అమెరికాలో జరుగుతున్న తానా సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డిని.. అక్కడున్న ఓ వ్యక్తి.. మీరు ప్రభుత్వంలోకి వస్తే.. రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధాన్ని అలాగే కొనసాగిస్తారా? లేదంటే ఆపేస్తారా? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. తెలంగాణ 95 శాతం మంది రైతులు.. మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులని, ఒక ఎకరానికి నీళ్లు పారాలంటే.. ఒక గంట చాలని అన్నారు. మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని.. మొత్తంగా ఒక 8 గంటలు ఉచితంగా ఇస్తే చాలన్నారు.

కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కక్కుర్తి పడి కమిషన్ల కోసం కక్కుర్తి పడి కేసీఆర్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అనే నినాదాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఉచిత విద్యుత్ పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని, ఇకపై ఇలాంటి ఉచితాలు అనుచితంగా వ్యవహరించాబోమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచితాలంటూ ఉండవనీ, తమ స్వార్థానికి వాడుకోబోమని తెలిపారు.

ఇక కాంగ్రెస్ కి నలుగురు ముఖ్యమంత్రులు ఉంటే అందులో ముగ్గురు బీసీ లేనని అన్నారు. దీంతో తెలంగాణలో సీతక్కకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారా..? అని ప్రశ్నించారు ఎన్. ఆర్.ఐ లు. దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని పార్టీలో చర్చిస్తామని అన్నారు. అవసరమైతే, ఆ సందర్భం వస్తే ఉపముఖ్యమంత్రి ఎందుకు.. సీతక్క ముఖ్యమంత్రి అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. 



Tags:    

Similar News