Minister Srinivas Goud : తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్..

Update: 2023-08-23 11:29 GMT

తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిపై సుప్రీం కోర్టు వేటు వేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసును విచారిస్తోన్న జడ్జి జస్టిస్ జయకుమార్‌ను సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ గౌడ్ కేసులో

రాజ్యాంగ వ్యవస్థలను నిందితులుగా పేర్కొనడం సరికాదని సీఈసీ వేసిన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం..వారి వాదనతో ఏకీభవించింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసులు పెట్టాలనే ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ జయకుమార్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసిన సుప్రీం కోర్టు.. ఆయన్ను సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏం జరిగిదంటే..

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌ గౌడ్ మహాబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని..అవి బయటకు రాకుండా శ్రీనివాస్ గౌడ్ లాబీయింగ్ చేశారని పలువురు ఆరోపించారు. పాత డాక్యూమెంట్ స్థానంలో కొత్తది ఆప్ లోడ్ చేశారని విమర్శించారు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని మహబూబ్‌నగర్‌‌కు చెందిన రాఘవేంద్ర రాజు.. హైదరాబాద్‌ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జయ కుమార్ ధర్మాసనం.. మంత్రితో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు 10 మంది అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో.. నాటి ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్, నాటి స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగ వ్యవస్థలను నిందితులగా చేర్చడం సరికాదని సుప్రీంకోర్టులో వాదనలుు వినిపించింది. దీంతో నేడు సుప్రీంకోర్టు జడ్జి జయకుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News