Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చొరవ.. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం

Byline :  Bharath
Update: 2024-01-22 15:59 GMT

ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ప్రతీ ఏటా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో ప్రతీరాష్ట్రానికి చెందిన శకటాల్ని ప్రదర్శిస్తారు. అయితే గత మూడేళ్లుగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శను నిలిపేశాడు. తాజాగా జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించే అవకాశం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ శకటానికి చోటు దక్కింది. 2015, 2020 తర్వాత మళ్లీ ఈ ఏడాదే రాష్ట్ర శకటం ఢిల్లీ వేడుకల్లో సందడి చేయనుంది. మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్ తో రాష్ట్ర శకటం రూపొందింది.

నిరంకుశ, రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్, రాంజీ గోండు, చాకలి ఐలమ్మల స్వయం పాలన, ప్రజాస్వామ్య ఉద్యమ స్ఫూర్తితో శకటాలను రూపొందించారు. ఎవరు పోరాటం చేసినా అంతిమంగా అది హక్కుల కోసమే అనే భావనతో దీన్ని రూపొందించారు. అటు రానున్న 2 ఏళ్ల పాటు ఢిల్లీలో రాష్ట్ర శకటం ప్రదర్శన ఉండనుంది. 




Tags:    

Similar News