పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు అలర్ట్ ప్రకటించింది. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసింది. నవంబర్ 17లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని ప్రకటించింది. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చని చెప్పింది. రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11, రూ. 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 20 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చారు.
రెగ్యులర్ విద్యార్థులు రూ. 125, 3 సబ్జెక్టులు, అంత కన్నా తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110, 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125, వొకేషనల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశముంది.