Group-1 Posts : నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-06 10:17 GMT

తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 లో మరో 60 పోస్టులు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులు ఉన్నాయి. తాజాగా మరో 60 పోస్టులు పెంచడంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 చేరింది. పెరిగిన ఖాళీలతో గ్రూప్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త ఊరట లభించనుంది. ఇదిలా ఉండగా మొత్తం పోస్టులకు గాను వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి తెలిపింది.

రాష్ట్రంలోని 9 డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న 60 గ్రూపు-1 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ గ్రూపు-1 పోస్టుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సేకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వీలైనంత తొందరగా వీటిని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆ వివరాల ప్రకారం అత్యధికంగా డీజీపీ, ఐజీ ఆఫీసుల్లో 24 డీఎస్పీ పోస్టులు, పంచాయతీరాజ్ డిపార్టుమెంటులో 19 ఎంపీడీవో పోస్టులు ఉన్నట్లు తేలింది. మొత్తంగా 60 పోస్టులు ఖాళీగా ఉండడంతో వీటిని తొలుత భర్తీ చేయడానికి పక్రియ మొదలైంది. టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ను జారీ చేయించి వీలైనంత తొందరగా వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆయా డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులు అధికారికంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను నేరుగా కమిషన్‌కు పంపాలని ఫైనాన్స్ డిపార్టుమెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మూడు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో నెం. 16) పేర్కొన్నారు.




 


Tags:    

Similar News