Dharani Guidelines: ధరణి గైడ్‌లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Byline : Veerendra Prasad
Update: 2024-02-29 09:24 GMT
ధరణి పోర్టల్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ధరణి మార్గదర్శకాలను(Dharani Guidelines) జారీ చేసింది. ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది.
ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఈ మార్గదర్శకాల్లో రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.