తెలంగాణ పర్యాటక శాఖ ఎండీపై ఈసీ సస్పెన్షన్ వేటు

By :  Krishna
Update: 2023-11-17 14:59 GMT

తెలంగాణ పర్యాటక శాఖ సంస్థ ఎండీ మనోహర్ రావుపై ఈసీ సస్పెన్షన్ వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎండీతో పాటు ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న సత్యనారాయణపై వేటు పడింది. మహబూబ్‌నగర్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 15న తిరుమల వెళ్లారు. మంత్రితో పాటు ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీ సత్యనారాయణ కూడా తిరుమలలో కనిపించారు. దీంతో వారిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు.

తెలంగాణ సీఈవో నివేదిక ఆధారంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇద్దరు అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈసీ తేల్చింది. దీంతో ఎండీ మనోహర్ రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఓఎస్డీ సత్యనారాయణను విధుల నుంచి తప్పించింది. ఇద్దరు అధికారులు కోడ్‌ ఉల్లంఘించడంపై వివరణ ఇవ్వాలని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిని ఈసీ ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19వ తేదీలోగా నివేదించాలని ఈసీ నోటీసులో స్పష్టం చేసింది.


Tags:    

Similar News