తెలంగాణ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. వెహికల్ పొల్యూషన్ టెస్టింగ్ పరీక్ష ఫీజును పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 23ను విడుదల చేసింది. ఈ క్రమంలో బండి టెస్ట్ చేసి సర్టిఫికెట్ జారీ చేసేందుకు.. టూ వీలర్ కు రూ.50, త్రీవీలర్ కు రూ.60, పెట్రోల్ కార్లకు రూ.75, డీజిల్ కార్లతోపాటు ఇతర కేటగిరీ వాహనాలన్నింటికీ రూ. 100 చొప్పున ఫీజు వసూలు చేయనున్నట్టు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వేతనాలు, వ్యయాలు పెరిగిన నేపథ్యంలో.. ఏడేళ్ల తర్వాత టెస్టింగ్ ఛార్జీలను పెంచనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.