Chadrayaan-3 : చంద్రయాన్-3 మిషన్‎లో తెలంగాణ ముద్దుబిడ్డ

Update: 2023-08-23 09:22 GMT

చంద్ర‌యాన్‌-3 ప్రయోగం తుది అంకానికి చేరింది. విక్రమ్ ల్యాండర్ ఇవాళ సాయంత్రం చంద్రునిపై అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో ల్యాండింగ్‎కు అంతా రెడీ అంటూ ఇస్రో తాజాగా ట్వీట్ చేసింది. ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కోసం అంతా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో చందమామపై చంద్రయాన్ 3 అడుగుపెట్టే చారిత్రకమైన ఘట్టం కోసం అందరూ కోట్లాది కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అద్భుతమైన మిషన్‌ వెనున ఎంతో మంది శ్రమ దాగివుంది. ఎంతో మంది ఈ ప్రయోగం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శ్రమను ఇంధనంగా మార్చి అద్భుతమైన ఆవిష్కరణకు తెరలేపారు.

భారతదేశం ఎంతో గర్వించదగిన ఈ మిషన్ లో తెలంగాణ ముద్దుబిడ్డ కీలక పాత్ర పోషించాడు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన యువకుడు కృష్ణ కుమ్మరి చంద్రయాన్ -3 మిషన్‎కు డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ రాశారు.

ప్రతిష్టాత్మమైన చంద్రయాన్‌-3 మిషన్‎లో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ కీలక పాత్ర పోషించాడు. ఈ మిషన్‎కు డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ రాసి తెలంగాణ ఖ్యాతిని పెంచాడు. కృష్ణ తల్లిదండ్రులు కుమ్మరి మద్దిలేటి, లక్ష్మీదేవి దంపతుల రోజువారీ కూలీలు. కృష్ణ తన హైస్కూల్ ను ప్రభుత్వ బడిలో పూర్తి చేశాడు. ఆ తరువాత తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి డిప్లొమా చేశాడు. హైదరాబాద్‌ వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి తన ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి తర్వాత ఇస్రోలో ఐసీఆర్‌బీ ఎగ్జామ్ రాశాడు. ఆ పరీక్షలో 4వ ర్యాంక్‌ సాధించి బెంగళూర్‌లో ఇస్రో లివోస్‌ డిపార్ట్‎మెంట్‎లో గ్రూప్‌-ఏ గెజిటేడ్‌ ఆఫీసర్‎గా బాధ్యతలు చేపట్టాడు. చంద్రయాన్‌-3 మిషన్‌లోనూ భాగస్వామ్యుడయ్యాడు. ఈ మిషన్‎లో LHVC, ILSA అనే 2 పెలోడ్స్‌‎కు డేటా ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రాశాడు కృష్ణ . చంద్రుడిపై వచ్చే ఎర్త్ క్వేక్స్ కెమోరాలో రికార్డు చేయడంతో పాటు పెలోడ్స్‌ నుంచి వచ్చే డేటాను ఐఎస్‌ఆర్‌ఏపీ బెంగళూర్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ రిసీవ్‌ చేసుకునేలా ఈ సాఫ్ట్‌వేర్‌ రూపొందించినట్లు వివరించాడు కృష్ణ.


Tags:    

Similar News