పొంగులేటికి ఝలక్.. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన తెల్లం

Update: 2023-08-16 11:43 GMT

కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన అనుచరుడు ఝలక్ ఇచ్చాడు. గత నెలలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయనతో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకున్న తెల్లం వెంకటరావు హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. మనసు మార్చుకుని తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకపోవడం, తనను నమ్ముకున్న బీఆర్ఎస్ కార్యకర్తల నమ్మకం వమ్ము చేయడం ఇష్టంలేకనే తిరిగి సొంతగూటికి వెళ్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు.కేసీఆర్ నాయకత్వంలోనే భద్రాచలం అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నట్లు తెల్లం వెంకటరావు చెప్పారు. అందుకే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.




 


తెల్లం వెంకటరావు మాజీ ఎంపీ పొంగులేటికి మొదటి నుంచి కుడిభుజంలా ఉన్నారు. 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో భద్రాచలం టికెట్‌ ఆశిస్తున్న ఆయన పొంగులేటితో కలిసి కాంగ్రెస్‌లో జాయిన అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే భద్రాచలం టికెట్ కేటాయించే అవకాశం ఉండడంతో వెంకటరావు ఆలోచనలో పడ్డారు.

కాంగ్రెస్ నుంచి భద్రాచలం టికెట్ దక్కే అవకాశం లేకపోవడం మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలు వెంకటరావుతో టచ్ లోకి రావడంతో ఆయన తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భద్రాచలం టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి హామీ వచ్చిన తర్వాతే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన గురువారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశముంది.




Tags:    

Similar News