High Temperature : తెలుగు రాష్ట్రాల్లో మండితున్న ఎండలు

Byline :  Vamshi
Update: 2024-03-01 04:49 GMT

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి.కర్నూలులో ఏకంగా 38.2 గరిష్థ ఉష్ణోగ్రతలు నమోదైంది. వచ్చే రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐదారు రోజులుగా రాయలసీమలో వేడి తీవ్రత ప్రారంభమైంది. మరోవైపు కోస్తాలో పలు చోట్ల ఉక్కపోతతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంది. రాత్రి పూట కూడా వేడి వాతావరణం కొనసాగుతుంది.

మరోవైపు తెలంగాణలోఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కాకుండానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో ఉష్ణోగ్రత‌లు మరింత భారీగా పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయన్నారు.

మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో కొత్తగూడెం, గోదావరి గని, ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రజ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో రాత్రి వేళ చల్లని వాతావరణం ఉంటున్నా, పగటి పూట ఉక్కపోత‌ పెడుతుంది. గ‌తేడాది ఈ సమయానికి 15-20 డిగ్రీల ఉష్ణోగ్రత‌లు నమోదు కాగా.. ఈసారి 32 డిగ్రీలు దాటి పోయాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఎన్నడూ చూడని ఎండలు రికార్డుల చెరిపేశాయి. ఎండ తీవ్రతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు ఆదే స్థాయిలో ఉంటాయంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు.వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వేసవిలో చమట ఎక్కువ పడుతుంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్‌కు బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. ఎండ నుంచి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తాగాలి. వేసవి ఉపశమనం కోసం కర్బూజ, దోసకాయలు, ఇతర పండ్లను తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు నల్లటి దుస్తులు ధరించకుండా బాగా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags:    

Similar News