అది కరెక్ట్ కాదు..బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కామెంట్స్
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్శానంపై చర్చ సందర్బంగా ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లును గుర్తచేసుకోవడం మంచిదన్నారు. గవర్నర్ ప్రసంగంలో మన్మోహన్, సోనియాను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన బీజేపీని విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా సర్కారు సంకుచిత స్వభావానికి నిదర్శనమని శంకర్ అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అవినీతిపై విచారణ గురించి మాట్లాడిస్తే ఇబ్బంది అని భావించి స్పీచ్‌లో పెట్టలేదేమోనంటూ పాయల్ శంకర్ ఎద్దేవాచేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ తీరుపై ప్రశ్నిస్తామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ ప్రస్తావన కూడా లేదని, అదే గవర్నర్ ప్రసంగంలో సోనియాగాంధీ గురించి గొప్పలు చెప్పించారు.. స్పీచ్ లో ఆమె గురించి పెట్టారన్నారు పాయల్ శంకర్. జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా ఎందుకు ప్రకటించలేదని, ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోయారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మాత్రమే తిట్టుకుంటున్నాయి.. కొట్టుకుంటున్నాయని, గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అవినీతిపై విచారణ గురించి మాట్లాడిస్తే ఇబ్బంది అని భావించి స్పీచ్ లో పెట్టలేదనుకుంటామని, అసెంబ్లీలో కాంగ్రెస్ తీరుపై ప్రశ్నిస్తామని పాయల్ శంకర్ అన్నారు.