కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్రానికి కేటాయిస్తూ బుధవారం (జనవరి 17) ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను తెలంగాణకు కేటాయించింది.