కాంగ్రెస్కు పేరొస్తుందనే ప్రాణహిత ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు: జీవన్ రెడ్డి

By :  Bharath
Update: 2023-12-29 11:50 GMT

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చయ్యాయని బీఆర్ఎస్ చెప్తోందని కానీ ఆ ప్రాజెక్ట్ కు ఖర్చైంది కేవలం రూ.50వేల కోట్లేనని ఆయన అన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందని, రాష్ట్ర ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్ పనులు మూడొంతలు పూర్తిచేసిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ కు పేరు వస్తుందన్న అక్కసుతోనే బీఆర్ఎస్ ఆ ప్రాజెక్ట్ ను పూర్తిచేయలేదని ఫైర్ అయ్యారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ కాలంలో ఆనకట్టలు కుంగిపోవడం ఏంటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తప్పిదాలు చేసిన గత ప్రభుత్వం ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చిందని అన్నారు. కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రజెక్టులన్నీ నిర్లక్ష్యంలో కట్టినవేనన్న జీవన్ రెడ్డి.. పెన్ గంగను వదిలేసి వార్దాపై ఆనకట్టను ఎలా ప్రతిపాదించారు? అని ప్రశ్నించారు.




Tags:    

Similar News