కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ నెల 9న మొదటి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగా.. నేటితో ముగిశాయి. మొత్తం 6 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. మొత్తం 26 గంటల 33 నిమిషాల పాటు వివిధ అంశాలపై సభలో చర్చ జరిగింది. మొత్తం సభ్యుల ప్రసంగాల సంఖ్య 19 అని స్పీకర్ ప్రకటించారు. ఇక సమావేశాల ప్రారంభం రోజున ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో నిరవధిక వాయిదా పడుతూ 6 రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. మొదటి 4 రోజులు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఇక చివరి రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. ఈ నెల 20న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. ఇక అసెంబ్లీ చివరి రోజైన ఇవాళ కూడా భట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ అప్పులపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఇక ఈ రెండు శ్వేత పత్రాలపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య రసవత్తరమైన చర్చ నడిచింది.