గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై విచారణ వాయిదా

Byline :  Krishna
Update: 2024-02-12 11:40 GMT

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు దాసోజుశ్రవణ్, సత్యనారాయణ సవాల్ చేశారు. ఇవాళ కోదండరాం, అమీర్‌ అలీఖాన్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో విచారణను ఈ నెల 14కు న్యాయస్థానం వాయిదా వేసింది.14న వాదనలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరఫు న్యాయవాదులు వినిపించనున్నారు.

2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఆ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలగా టీజేఎస్ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీనిపై దాసోజు, సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో తమ ఆదేశాలు వచ్చేవరకు వారితో ప్రమాణం చేయించొద్దని న్యాయస్థానం ఆదేశించింది.

Tags:    

Similar News