వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ షాక్

Update: 2023-07-27 10:03 GMT

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును.. సుప్రీంకోర్టులో సవాల్ చేసేవరకు నిలిపేయాలని ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును నిలిపివేసేందుకు నిరాకరిస్తూ.. వనమా పిటిషన్ను కొట్టేసింది.

2018 ఎన్నికల సమయంలో అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. వనమాపై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని, డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణిస్తూ హైకోర్టు డిక్లేర్ చేసింది.

గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. అయితే వనమా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారంటూ గతంలో జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్నేళ్లుగా వెంకట్రావు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగ్గా మొన్న తుది తీర్పు వెల్లడించింది. ఇక ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించనున్నారు.



Tags:    

Similar News