నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2018లో నమోదైన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. భార్యను చంపిన కేసులో నిందితుడు ఇమ్రాన్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2018లో అదనపు కట్నం కోసం ఇమ్రాన్ తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. దీనిపై కేసు నమోదు చేసిన భవానీ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.