Rythu Bandhu: రైతు బంధును ఐక్యరాజ్యసమితి సైతం అభినందించింది : కవిత

By :  Krishna
Update: 2023-10-17 05:58 GMT

రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి సైతం అభినందించిందని ఎమ్మెల్యే కవిత అన్నారు. కేసీఆర్ పథకాలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్కు అన్ని జిల్లాల్లో అన్నదాతలు అండగా నిలుస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు.

‘‘రైతులకు పంట పెట్టుబడి అందించేందుకు కేసీఆర్ ప్రారంభించిన పథకం రైతు బంధు. ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన గొప్ప కార్యక్రమం రైతు బంధు. ఎకరానికి 8వేలతో మొదలై, 10వేలకు పెంచుకున్నాం. వచ్చే ఏడాది నుండి రైతు బంధు సాయాన్ని రూ. 12వేలకు పెంచుతామని, క్రమంగా ప్రతీ ఏటా పెంచుతూ రూ. 16వేలు అందిస్తామని కేసిఆర్ మేనిఫెస్టోలో ప్రకటించడం చారిత్రాత్మకం. రానున్న ఎన్నికలలో రైతుల ఆశీర్వాదం కోరుతున్నాం.

Tags:    

Similar News