ఆ జిల్లాల వారు.. రానున్న రెండు రోజులు జాగ్రత్త..!

Update: 2023-07-06 05:41 GMT

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీంతో గురు, శుక్రవారాల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సిద్దిపేట్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి ఖమ్మం, సూర్యపేట్, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచింది. 




Tags:    

Similar News