BJP CM Candidate: రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేత..! బీసీ నేతే సీఎం అభ్యర్థిగా..
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బరిలో దిగే అభ్యర్థుల లిస్ట్ పై బీజేపీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. 55 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితాకు.. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఢిల్లీలో రాష్ట్ర నేతలతో.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. గెలుపు, ఓటములు బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేసి.. ఫస్ట్ లిస్టుపై కసరత్తు పూర్తి చేసింది. ఇవాళ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం గోషామహల్ టికెట్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కు కేటాయిస్తున్నారనే వార్తలు వినిపించాయి. అయితే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి గోషామహల్ టికెట్ తిరిగి ఆయనే కేటాయించినట్లు తెలుస్తుంది.
ఇటీవల కమెడియన్ మునావర్ ఫారుఖీ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు. దాంతో బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో రాజాసింగ్, మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లగా.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అదే నిజం అన్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంతి తొలి జాబితాలో గోషామహల్ టికెట్ ఖాళీగా ఉంచడంతో.. ఆ ప్రచారం ఇంకా జోరందుకుంది. వాటిని ఖండించిన రాజాసింగ్.. బీజేపీ పార్టీని వీడేది లేదని, త్వరలనే తనపై ఉన్న సస్పెన్షను ఎత్తేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు బీజేపీ ముఖ్య నేతలను కలిసిన రాజాసింగ్.. తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. దానిపై చర్చ జరిపిన అధిష్టానం ఇవాళ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.