Lok Sabha 2024: బీజేపీ ప్రకటించిన 9 మంది తెలంగాణ అభ్యర్థులు వీరే..
Byline : Veerendra Prasad
Update: 2024-03-02 13:40 GMT
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకుగానూ పోటీదారులను ప్రకటించగా.. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మందిని ప్రకటించింది. తొలి జాబితాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ లో చోటు దక్కించుకున్నారు. మిగిలిన ఆరుగురు ఎవరంటే..
కరీంనగర్ నుంచి బండి సంజయ్
నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్
సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి
మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్
జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్
హైదరాబాద్ నుంచి మాధవీ లత
భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్
చెవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్ నుంచి పి.భరత్ లు ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.