తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారం చేపట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. కాకపోతే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితం అయింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్.. 2018 ఎలక్షన్స్ లో ఏకంగా 88 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. అయితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవడంతో.. 2023 ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. కాగా పార్టీ ఆవీర్భావం జరిగినప్పటి నుంచి అంటే 2001 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 6 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవలేదు.
సాధారణ, ఉప ఎన్నికల్లో ఆ 6 స్థానాల్లో ఓడిపోతూ వస్తుంది. గోషామహల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తూనే ఉన్నా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. కాగా ఆ పార్టీ తొలిసారి గెలిచిన పార్టీలు కూడా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన సబితా రెడ్డికే ప్రస్తుతం టికెట్ ఇవ్వడంతో తొలి విజయం దక్కింది. 2014, 2018లో ఎల్బీనగర్ స్థానంలో ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీలో చేరిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కూడా ఈసారి గెలిచారు. భద్రాచలం నియోజకవర్గంలో తొలిసారి బీఆర్ఎస్ కు విజయం వరించింది. పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలిచారు.