Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు ఇవే
(Telangana Budget 2024) తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2లక్షల 75వేల 891 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆరు గ్యారెంటీలు, గ్రామీణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. నీటి పారుదల, వ్యవసాయ రంగాలకు సైతం బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వ బడ్జెట్లు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని భట్టి ఆరోపించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే దుబారా తగ్గించామని..
నిస్సాహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
బడ్జెట్ అంచనా వ్యయం - 2, 75, 891 కోట్లు
మూలధన వ్యయం - 29, 669 కోట్లు
రెవెన్యూ వ్యయం - 2,01,178 కోట్లు
రెవెన్యూ మిగులు - 5,944 కోట్లు
ద్రవ్య లోటు - 32, 557 కోట్లు
ఆరు గ్యారెంటీలకు - 53 196 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు - 40080 కోట్లు
వ్యవసాయానికి - 19,746 కోట్లు
నీటి పారుదల శాఖకు - 28,024 కోట్లు
విద్యారంగానికి - 21,389 కోట్లు
వైద్య రంగానికి - 11,500 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి - 21,874 కోట్లు
ఐటీ శాఖకు - 774 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి - 13,013 కోట్లు
మైనార్టీ సంక్షేమం - 2,262
బీసీ సంక్షేమం - 8వేల కోట్లు
విద్యుత్ సంస్థలకు - 16,825 కోట్లు
గృహ నిర్మాణానికి - 7,740 కోట్లు
విద్యుత్ గృహ జ్యోతి పథకానికి - 2,418 కోట్లు
టీఎస్సీఎస్సీకి - 40 కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు - 500
యూనివర్సిటీల్లో సదుపాయాలకు - 500
మూసీ ప్రాజెక్ట్ కు - 100 కోట్లు
మున్సిపల్ శాఖకు - 11,692