సామాన్యులకు ధరల మంట.. పచ్చిమిర్చి, టమాటాలు దొంగతనం

Update: 2023-07-06 04:09 GMT

టమాటా, పచ్చిమిర్చి ప్రస్తుతం బంగారంగా మారాయి. వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ.. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. కూరగాయల రేట్లు చూసి ప్రజలు మార్కెట్ నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ క్రమంలో దొంగల కన్ను కూరగాయలపై పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్కకల్ లోని కూరగాయల మార్కెట్ లో రాత్రి సమయంలో పలు దుకాణాల్లో దొంగలు పడ్డారు. నైట్ వాచ్ మెన్ లేనిది చూసి.. సైలెంట్ గా పచ్చి మిర్చి, టమాటా ఎత్తుకెళ్లారు. ఉదయం దుకాణం తెరిచి చూసిన యజమాని విషయం తెలిసి షాక్ తిన్నాడు. తర్వాత పోలీస్ లను ఆశ్రయించాడు.

ఇటీవల కర్నాటకలో కూడా ఇదే జరిగింది. బేలూరులో టమాటా పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. రాత్రి సమయంలో తోటలోకి ప్రవేశించి 60 సంచుల టమాటా ఎత్తుకెళ్లారు. పోయిన పంట ధర రూ. 1.5 లక్షలు ఉంటుందని రైతు లబోదిబోమంటున్నాడు. ఆలూరులో మరో రైతు తన టమాటా పంటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. దొంగల భయంతో ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News