హైదరాబాద్లో దొంగలు వాటిని కూడా వదలడం లేదు..

Byline :  Krishna
Update: 2024-02-18 15:09 GMT

దొంగలు దేన్నీ వదలడం లేదు. చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బులు వస్తయంటే ఏదైనా అమ్మేయోచ్చనే పాలసీని ఫాలో అవుతున్నట్లున్నారు. హైదరాబాద్లో ఓ చోట దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువులను చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే వాళ్లు ఎత్తుకెళ్లింది మ్యాన్ హెల్స్ మీద మూతలు. అవును మీరు వింటున్నది నిజమే. గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర ఉన్న మూడు మ్యాన్ హెల్స్ పై మూతలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఐరన్ తో చేసిన వీటి దాదాపు 30 కిలోలు ఉంటుంది. దీనిపై జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మ్యాన్ హోల్స్ పై మూతలు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానకులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మూతలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News