KTR : చిన్నారుల పిలుపుతో మనసు మారింది..

Byline :  Vinitha
Update: 2024-03-01 03:05 GMT

చిన్నారుల మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. తమ ముద్దులొలికే మాటలతో మీ కోసం వెయిట్ చేస్తున్నాం కేటీఆర్ సార్ అనుకుంటూ వారు పంపిన వీడియో తన మనసు మార్చేశాయని చెప్పారు. చిన్నారుల ఇన్విటేషన్ మేరకు తప్పకుండా వారి పాఠశాల వార్షిక దినోత్సవానికి హాజరవుతానన్నారు. అంతేగాక స్వయంగా వారిని అభినందిస్తానంటూ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ మిలీనియమ్ స్కూల్ చిన్నారులు మార్చి 3న జరిగే..స్కూల్ వార్షికోత్సవానికి వీడియో ద్వారా కేటీఆర్ ను ఆహ్వానించారు. వారి స్కూల్ ఫంక్షన్ కి రావాలని, మేమందరం మీ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకుంటూ వీడియో సందేశంతో ఆహ్వానించారు. దీని పై స్పందించిన కేటీఆర్ ఆ రోజు తనకుఇతర కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు తనకు అందిన క్యూట్ ఇన్విటేషన్ ఇదే అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక చిన్నారుల కోరిక మేరకు వాళ్లని వెళ్లి కలుస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు.

Tags:    

Similar News