కేటీఆర్ సమావేశానికి మల్లారెడ్డి, మర్రి, సుధీర్ డుమ్మా

Byline :  Lenin
Update: 2023-12-04 09:46 GMT

తెలంగాణ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వ హించిన సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడైన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో పలు ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

ఎన్నికల్లో ఓటమి కారణాలపై సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్సీ కవిత, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత అందరూ అధినేత కేసీఆర్‌ను కలవడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీకి కారణాలేంటో తెలియడం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిస్తే తప్పేంటని మల్లారెడ్డి ఆదివారం అన్నారు.

మరోవైపు కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమాశమయ్యారు. సీఎంను ఎన్నుకునే బాధ్యతను పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గేకి అప్పగించారు.

Tags:    

Similar News