TIMES NOW: ఎంపీ ఎన్నికలొస్తే తెలంగాణలో ఆ పార్టీకే మెజారిటీ..!

By :  Bharath
Update: 2023-12-14 10:04 GMT

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు పెడితే ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయనే విషయంపై టైమ్స్ నౌ (TIMES NOW) సంస్థ ఈజీటీ(ETG) సర్వే చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలుస్తుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ కొడుతుందని స్పష్టం చేసింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. కాంగ్రెస్ 8-10 స్థానాలు, బీఆర్ఎస్ 3-5 స్థానాలు, బీజేపీ 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే.. 52 నుంచి 72 సీట్లకు మించి రావని టైమ్స్ నౌ-ఓటీజీ సర్వే వెల్లడించింది. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్ 37%, బీఆర్ఎస్ 32%, బీజేపీ 24% ఓట్లు సాధిస్తాయని వెల్లడించింది. కాగా 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎన్డీయే కూటమికి 353 స్థానాల్లో గెలుపొందగా, ఈసారి ఆ సంఖ్య కాస్త తగ్గనుందని పేర్కొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 ఎంపీ స్థానాలు దక్కడం తెలిసిందే.



Tags:    

Similar News