TJS Chief Kodandaram: రాహుల్తో కోదండరాం కీలక భేటీ.. పొత్తులపై క్లారిటీ ఇస్తామంటూ..

By :  Bharath
Update: 2023-10-20 07:20 GMT

ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడాలనే ఆకాంక్షతోనే రాహుల్ గాంధీని తాను కలిసినట్లు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. బస్సు యాత్ర చేపట్టి.. ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీని.. కరీంనగర్ లోని వీ పార్క్ హోటల్ లో కలిశారు కోదండరాం. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీట్ల గురించి తమ మధ్య చర్చ జరగలేదని, 3 రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుంది అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ, కోదండరాంను కోరినట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న నియోజక వర్గాల్లో కోదండరాం సీట్లు అడిగినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు ముదోల్, కోరుట్ల, జహీరాబాద్ నియోజక వర్గాల్లో గెలవాలని కోదండరాం పార్టీ భావిస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థ ధ్వంసం అయిందని కోదండరాం ఆరోపించారు. బీఆర్ఎస్ ను గద్దెదించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.

Tags:    

Similar News