Harish Rao : బీఆర్ఎస్ సభ డైవర్ట్ చేసేందుకే..కాంగ్రెస్ మేడిగడ్డ పర్యటన...హారీశ్ రావు
నేడు అసెంబ్లీ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నానన్నారు మాజీ మంత్రి హారీశ్ రావు. మీరు మాట్లాడి, మాకు మైకులు ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రధాన పత్రిపక్షంగా బీఆర్ఎస్ కు సమయం ఇవ్వట్లేదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ప్రభుత్వం తీరు ఉందని మండిపడ్డారు. నల్గొండలోని సభతో కాంగ్రెస్ కళ్లు తెరిచిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని చెప్పారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం అని వీటన్నింటి సమాహారమే కాళేశ్వరమని తేల్చి చెప్పారు. ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని మండిపడ్డారు. బ్యారెజీలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దాలని సూచించారు.
అలాగే, వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాళేశ్వరం ఫలితాలు రైతును అడగండని..కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ చూసి అద్బుతం అని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు వచ్చాయని అన్నారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటీకి ఎందుకు ప్రాణహిత, చేవెళ్ల కట్టలేదని ప్రశ్నించారు. నీళ్లు ఉన్న దగ్గర ప్రాజెక్టులు కట్టామన్న ఆయన..మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అని తెలిపారు. పర్యటన పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకండని కోరారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లే ఓవర్ కూలి 20 మంది చనిపోయారని..దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయని గుర్తు చేశారు. అలాంటి ఘటనలు జరగటం బాధాకరమని..అయినా ముందుకు వెళ్ళాం కదా అని చెప్పారు. కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించ వద్దని మేము నిద్ర లేపితే లేచారని ఆరోపించారు. ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ సభ ఉంది కాబట్టే..దాన్ని డైవర్ట్ చేయడానికే పోటీగా ఈ కార్యక్రమం పెట్టారని ప్రజలంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారని మాజీ మంత్రి హారీశ్ అన్నారు.